లేటెస్ట్ ట్రెండ్‌తో సాంగ్స్ గుర్తించబడటం లేదు.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ

లేటెస్ట్  ట్రెండ్‌తో సాంగ్స్ గుర్తించబడటం లేదు.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ

మెలోడీ బ్రహ్మ మణిశర్మ(Mani Sharma) తన పాటలతో టాలీవుడ్ లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు.లేటెస్ట్ గా మణిశర్మ కంపోస్ చేసిన మూవీ   కార్తికేయ హీరోగా బెదురులంక 2012. ఈ మూవీ 25 ఆగస్ట్ 2023న థియేటర్లలో రిలీజ్ కు రెడీ గా ఉంది. ఇప్పటికే  సాంగ్స్, టీజర్ తో ఆకట్టుకోగా ఆడియన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. దీంతో మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్నమ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రసెంట్ మనమందరం సాంగ్ తర్వాత సాంగ్ ను రిలీజ్ చేసే కొత్త కాన్సెప్ట్ కు దగ్గరగా ఉన్నాము. కానీ దీని వల్ల, కొన్ని గొప్ప కంపోజిషన్‌లు గుర్తించబడవు అని.. మణి శర్మ ఇలా పంచుకున్నారు. 

ఆడియో సింగిల్స్‌ను ఒక్కొక్కటిగా విడుదల చేసే సరికొత్త ట్రెండ్‌తో ప్రసెంట్ జనరేషన్ నడుస్తుంది. ఈ రోజుల్లో ఫస్ట్ టైం సాంగ్స్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తేనే, సాంగ్స్ వినడం బాగా అలవాటు అయింది. కానీ, అప్పటి రోజుల్లో సాంగ్స్ అన్ని ఒకేసారి వినేవాళ్లు. వాస్తవానికి, కొన్ని పాటలు సెకండ్ టైంలో, థర్డ్ టైంలో లేదా కొన్ని సందర్భాల్లో టెన్ టైమ్స్ వింటుంటే కూడా బాగా ఆకట్టుకునేవి. ఇప్పుడు లేటెస్ట్  ట్రెండ్‌తో, చాలా గొప్ప కంపోజిషన్‌లు గుర్తించబడటం లేదు, అది విచారకరం! నిజానికి ఇది నిజం, ఇప్పటికీ దీన్ని గురుంచి ఎవరూ అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదని మణిశర్మ అన్నారు. 

ALSO READ :లండన్ వీధుల్లో 700 మంది.. నాటు నాటు పాటకు దుమ్ములేపేశారు

బెదురులంక 2012 లో సాంగ్స్ విషయంలో ప్రతి సాంగ్ కు మంచి ఫీలింగ్ ఉంటుంది.  వెన్నెల్లో ఆడపిల్ల, సొల్లుడా శివా,దొంగోడే.. దొరగాడు లాంటి సాంగ్స్ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది అని మణిశర్మ పేర్కొన్నారు. 

కార్తికేయ(Kartikeya), నేహాశెట్టి(Neha Shetty) జంటగా నటిస్తోన్న ఈ మూవీకు క్లాక్స్ డైరెక్షన్ చేస్తుండగా రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు. కాగా అజయ్ ఘోష్, రాజ్ కుమార్ బసిరెడ్డి, గోపరాజు రమణ, ఆటో రామ్ ప్రసాద్ కెలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌(Loukya entertainments Banner)పై నిర్మించింది.