
దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)కాంబోలో వచ్చిన RRR మూవీ.. ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను కూడా అందుకుంది ఈ సినిమా. ఇక ఈ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది.
ALSO READ :డైరెక్టర్ సముద్రఖని..తిరిగి తన ప్రపంచానికి.. ఎక్కడికో తెలుసా?
ఈ సినిమా రిలీజై ఏడాది పూర్తవుతున్నా.. నాటు నాటు పాటకున్న క్రేజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. తాజాగా లండన్ వీధుల్లో 700 మంది ఈ పాటకు డాన్స్ వేసి అదరగొట్టేశారు. ఆగష్టు 7న జాతీయ చేనేత దినోత్సవం నేపధ్యంలో అక్కడి మహిళలంతా చీరల్లో నాటు నాటు పాటకి కాలు కదిపి కుమ్మేశారు. లండన్ లోని 10 డౌనింగ్ స్ట్రీట్ లో జరిగిన ఈ ప్రదర్శన సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి.
Naatu Naatu opposite 10 Downing Street today https://t.co/neqM08DJuu pic.twitter.com/WMIUfvSqqD
— Naomi Canton (@naomi2009) August 7, 2023