ఇటలీ ప్రధానిగా జార్జియా ప్రమాణ స్వీకారం

ఇటలీ ప్రధానిగా జార్జియా ప్రమాణ స్వీకారం
  • 24 మందితో కేబినెట్​ ఏర్పాటు

రోమ్: ఇటలీ తొలి మహిళా ప్రధానిగా జార్జియా మెలోని, ప్రెసిడెంట్​ సెర్గియో మత్తరెల్లా సమక్షంలో శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. పోయిన నెలలో జరిగిన ఎన్నికల్లో బ్రదర్స్​ ఆఫ్​ ఇటలీ పార్టీకి చెందిన 45 ఏండ్ల మెలోని, 26.37% ఓట్లు సాధించా రు. మాటియో సాల్విని నేతృత్వం వహిస్తున్న రైట్​వింగ్​ లీగ్, మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ చీఫ్​గా ఉన్న కన్జర్వేటివ్​ ఫోర్జా ఇటాలియా పార్టీలతో పొత్తు పెట్టుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

మెలోని తో పాటు 24 మంది సభ్యులు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఐదుగురు ఇండిపెండెంట్​ సభ్యులున్నారు. మెలోని తన కేబినెట్​లో ఆరుగురు మహిళలకు చాన్స్​ ఇచ్చారు.