మెరిసే స్కిన్ కోసం మగవాళ్లు ఈ టిప్స్ ఫాలో అవ్వండి

V6 Velugu Posted on Aug 25, 2021

ఒకప్పుడు ఫ్యాషన్‌‌, ట్రెండ్స్‌‌ని ఆడవాళ్లు మాత్రమే ఎక్కవగా ఫాలో అయ్యేవాళ్లు. కానీ, ఇప్పుడు మగవాళ్లు అంతకంటే ఎక్కువగా రెడీ అవుతున్నారు! అలానే స్కిన్‌‌కేర్‌‌‌‌ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అట్రాక్టివ్‌‌గా, అందంగా కనిపించాలని చాలా ట్రై చేస్తున్నారు. చర్మాన్ని హైడ్రేటెడ్‌‌గా, రేడియంట్‌‌గా ఉంచుకోవాలంటే కొన్ని టిప్స్‌‌ ఉన్నాయి. అవి ఫాలో అయితే సరి.. 

  • మగవాళ్లు బయట ఎక్కువగా తిరుగుతుంటారు. దీంతో పొల్యూషన్‌‌ వల్ల చర్మం మీద దుమ్ముధూళి పేరుకుపోయి, ట్యాన్‌‌ ఏర్పడుతుంది. అలా కాకూడదంటే ఇంట్లోకి వచ్చాక కచ్చితంగా ముఖం శుభ్రం చేసుకోవాలి.  పాలు లేదా తక్కువ గాఢత ఉన్న ఫోమింగ్‌‌ క్లెన్సర్‌‌‌‌తో క్లెన్సింగ్‌‌ చేయాలి. వారానికి మూడుసార్లు కచ్చితంగా ఎక్స్‌‌ఫోలియేటింగ్‌‌ చేయడం మంచిది‌‌. లెమన్‌‌ గ్రాస్‌‌, యూకలిప్టస్‌‌ లాంటి వాటితో వారానికి ఒకసారైనా స్క్రబ్‌‌ చేసుకోవాలి. 
  • క్లెన్సింగ్‌‌ చేసుకున్నాక కచ్చితంగా విటమిన్‌‌ – సి సీరమ్‌‌ను రాయాలి. దానివల్ల ముఖం మెరుస్తుంది. ముఖం అందంగా, మెరుస్తూ కనిపిస్తుంది. 
  • సన్‌‌స్క్రీన్‌‌ లోషన్‌‌ అనగానే ఆడవాళ్లు పెట్టుకునే క్రీం అనుకుంటారు. కానీ, సూర్యుడి నుంచి వచ్చే యూవీ రేస్‌‌ నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే మగవాళ్లు కూడా సన్‌‌స్క్రీన్‌‌ లోషన్‌‌ వాడాలి. ఇంట్లో ఉన్నా, బయటకి వెళ్తున్నా ఎస్‌‌పీఎఫ్‌‌ 30 సన్‌‌స్క్రీన్‌‌ రాసుకోవాల్సిందే. 
  • కొంతమంది చలికాలంలో మాత్రమే మాయిశ్చరైజర్‌‌‌‌ వాడతారు. కానీ, చర్మాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌‌గా ఉంచుకోవాలంటే కాలంతో పని లేకుండా మాయిశ్చరైజర్‌‌‌‌ వాడాలి. సీరమ్‌‌ పెట్టిన తర్వాత మాయిశ్చరైజర్‌‌‌‌ రాస్తే సీరమ్ ఎక్కువసేపు ఉంటుంది. 
  • మగవాళ్ల చర్మం కొంచెం రఫ్‌‌గా, మందంగా ఉంటుంది. అలాంటప్పుడు స్కిన్‌‌టైప్‌‌  బట్టి ప్రొడక్ట్స్‌‌  తీసుకోవాలి. యాక్నే సమస్య ఉన్నవాళ్లు పొడిచర్మం వాళ్లు వాడే ప్రొడక్ట్స్‌‌ వాడకూడదు. కెమికల్‌‌ ఫ్రీ, నేచురల్‌‌ ప్రొడక్ట్స్‌‌ వాడితే మంచిది. 

Tagged tips, Men, glowing skin

Latest Videos

Subscribe Now

More News