నేటి నుంచి మెన్స్‌‌‌‌‌‌‌‌ హాకీ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌

నేటి నుంచి మెన్స్‌‌‌‌‌‌‌‌ హాకీ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌
  • బరిలో 16 జట్లు
  • 48 ఏండ్ల తర్వాత కప్పుపై కన్నేసిన ఇండియా

‌‌‌‌‌‌‌
ఖతార్‌‌‌‌‌‌‌‌ గడ్డపై పోయినేడాది ఫిఫా వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ సాకర్‌‌‌‌‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌కు మస్తు కిక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. ఇప్పుడు హాకీ అభిమానులకు అలాంటి మజాను అందించేందుకు  ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐహెచ్‌‌‌‌‌‌‌‌ మెన్స్‌‌‌‌‌‌‌‌ హాకీ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ వచ్చేసింది. ఒడిశాలో హాకీ వీరుల మహా సంగ్రామం నేడే షురూ అవుతోంది..! 16 జట్లు బరిలో నిలిచిన టోర్నీలో తొలి రోజు నాలుగు మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు జరగను న్నాయి. 48 ఏండ్ల తర్వాత కప్పు నెగ్గాలని ఆశిస్తున్న ఇండియా బలమైన స్పెయిన్​తో పోరు ఆరంభించనుంది.

రూర్కెలా: 

1971లో బ్రాంజ్.. 1973లో సిల్వర్​.. 1975లో గోల్డ్​.. ఎఫ్ఐహెచ్​ హాకీ వరల్డ్​కప్​లో ఇండియా హిస్టరీ ఇది. కానీ 1978 నుంచి 2014 వరకు కనీసం గ్రూప్​ స్టేజ్​ను కూడా దాటలేకపోయింది. 2018లో సొంతగడ్డపై జరిగిన మెగా టోర్నీలోనూ క్వార్టర్స్​లోనే ఇంటిముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మరోసారి సొంత ఇలాఖాలో ఆరో ర్యాంకర్​ టీమిండియా వరల్డ్​కప్​ వేటను షురూ చేస్తోంది. శుక్రవారం జరిగే గ్రూప్​–డి మ్యాచ్​లో వరల్డ్​ ఎనిమిదో ర్యాంకర్​ స్పెయిన్​తో అమీతుమీ తేల్చుకోనుంది. ఒకప్పుడు ఎనిమిది ఒలింపిక్​ గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌తో ప్రపంచ హాకీని శాసించిన ఇండియా టీమ్​ ప్రతిష్ట క్రమంగా మసకబారినా.. టోక్యో ఒలింపిక్స్​లో బ్రాంజ్​ మెడల్​తో పూర్వ వైభవాన్ని అందుకుంది.  దీంతో 48 ఏళ్ల తర్వాత మళ్లీ వరల్డ్​కప్​ నెగ్గాలని టార్గెట్​గా పెట్టుకుంది. తొలి రోజు మ్యాచ్​ల్లో అర్జెంటీనాతో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో ఫ్రాన్స్​, ఇంగ్లండ్​తో వేల్స్​తలపడనున్నాయి.  పూల్​–డిలో ఈ నెల 15, 19న జరిగే తర్వాతి మ్యాచ్​ల్లో ఇండియా.. వరుసగా ఇంగ్లండ్​, వేల్స్​తో తలపడుతుంది. 

గెలుపే లక్ష్యంగా..

హర్మన్​ప్రీత్​ సింగ్​ కెప్టెన్సీలోని టీమిండియా ఇప్పుడు మెడలే లక్ష్యంగా వరల్డ్​కప్​ వేటను మొదలుపెడుతోంది. ఇటీవల వరల్డ్​ నంబర్​వన్​ ఆసీస్​తో జరిగిన సిరీస్​ను 1–4తో కోల్పోయినా.. ఇండియా పెర్ఫామెన్స్​కు మంచి మార్కులే పడ్డాయి. కోచ్​ గ్రాహం రీడ్​ గైడెన్స్​లో ఇండియా చాలా మెరుగైంది. ఇప్పుడు అదే ఆటను మెగా టోర్నీలోనూ కొనసాగించాలని ప్లాన్స్​ వేస్తోంది. అయితే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఈసారి సెమీస్​ చేరాలని తొలి టార్గెట్​గా పెట్టుకుంది. ఇక 2021–22 హాకీ ప్రొ లీగ్​లో మూడో ప్లేస్​లో నిలవడం టీమ్​ కాన్ఫిడెన్స్​ పెంచే అంశం. రీడ్​ రాకతో ప్లేయర్ల ఆటతీరులో కూడా చాలా మార్పు వచ్చింది. రీడ్​ స్ట్రాటజీస్​, ట్రేడ్​ మార్క్​ షాట్స్​లో నైపుణ్యం వంటి అంశాల్లో ప్రతి ప్లేయర్​కు ఓ స్టైల్​ను క్రియేట్​ చేశాడు. మరోవైపు  ఇండియా తొలి ప్రత్యర్థి స్పెయిన్​ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తమదైన రోజున ఎంతటి ప్రత్యర్థినైనా ఓడించే శక్తి సామర్థ్యాలు ఆ టీమ్​కు పుష్కలంగా ఉన్నాయి. 1971, 1998లో రన్నరప్​గా నిలిచిన స్పెయిన్​ 2006లో బ్రాంజ్​ మెడల్​ గెలిచింది. గత ప్రో లీగ్​ తొలి మ్యాచ్​లో 3–2తో ఇండియాపై నెగ్గిన స్పెయిన్ రెండో మ్యాచ్​లో పెనాల్టీ షూటౌట్​లో ఓడింది. ఈసారి ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

ఏ గ్రూప్​లో ఎవరు

పూల్​-ఎ: అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్​, సౌతాఫ్రికా; పూల్-బి: బెల్జియం, జర్మనీ, జపాన్​, కొరియా; పూల్​-సి: చిలీ, మలేసియా, నెదర్లాండ్స్​, న్యూజిలాండ్​; పూల్‌‌‌‌‌‌‌‌-డి: ఇండియా, స్పెయిన్‌‌‌‌‌‌‌‌, ఇంగ్లండ్​, వేల్స్.

నేటి మ్యాచ్​లు

అర్జెంటీనాX సౌతాఫ్రికా మ. 1.00
ఆస్ట్రేలియాX ఫ్రాన్స్ మ. 3.00
ఇంగ్లండ్​X వేల్స్  సా. 5.00
ఇండియాX స్పెయిన్‌‌‌‌ రా. 7.00
స్టార్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌లో లైవ్‌‌‌‌

మరిన్ని వార్తలు