సమ్మర్ టైమ్.. అబ్బాయిల అందానికి టిప్స్

సమ్మర్ టైమ్.. అబ్బాయిల అందానికి టిప్స్

బ్యూటీ టిప్స్​ అనగానే గుర్తొచ్చేది ఆడవాళ్లే. మరి మగవాళ్ల మాటేంటి..అబ్బాయిలకీ బోలెడు స్కిన్​ ప్రాబ్లమ్స్​ వస్తాయి. వాటికి పరిష్కారాలే ఇవి..స్మార్ట్​గా కనిపించాలంటే అబ్బాయిలు ఈ టిప్స్​ ఫాలో అవ్వాల్సిందే. మగవాళ్ల చర్మం ఆడవాళ్ల చర్మం కంటే ఎక్కువ జిడ్డుగా ఉంటుంది. అయితే కొందరి చర్మం మాత్రం పొడిబారుతుంది. అందుకే ఏ సీజన్​లో అయినా మగవాళ్లు తప్పనిసరిగా మాయిశ్చరైజర్​ రాసుకోవాలి. చర్మతత్వాన్ని బట్టి సరైన మాయిశ్చరైజర్​ ఎంచుకుని.. రోజుకి రెండుమూడు సార్లు రాయాలి. అలాగే బయటికెళ్తున్నప్పుడు సన్​స్ర్కీన్​ లోషన్​ తప్పనిసరి.

సోప్ కన్నా ఫేస్‌వాష్ బెటర్

అబ్బాయిలంతా ముఖానికి సబ్బులే వాడుతుంటారు. కానీ, సోప్​ కన్నా ఫేస్​వాష్​​ వాడటం మంచిది.  సెన్సిటివ్ స్కిన్​ వాళ్లు అసలు సబ్బు జోలికే వెళ్లకూడదు. మైక్రో బీడ్స్ కలిగిన ఫేస్ వాష్​లు​  ట్యాన్​ని పోగొడతాయి. కాబట్టి అలాంటి వాటినే వాడాలి. మగవాళ్ల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఫేస్​వాష్​లను ఎంచుకోవచ్చు. కొన్ని హెయిర్ జెల్స్​లో ఆల్కహాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు నేచురల్ ఆయిల్స్​ని కోల్పోయేలా చేస్తుంది. జుట్టు డ్రైగా, డ్యామేజ్ అవడానికి కారణమవుతుంది. అందువల్ల అలాంటి జెల్స్​ జోలికి వెళ్లకపోవడమే మంచిది. వాటికంటే కొబ్బరినూనె వాడటం మేలు.

నిగారింపు కోసం ఫేస్‌‌ప్యాక్

గడ్డం పెంచుకునే అబ్బాయిలు వారానికి రెండుసార్లు షాంపూ, కండిషనర్​ని రాయాలి. ఇవి గడ్డాన్ని స్మూత్ గా ఉంచుతాయి. దురద లేకుండా చేస్తాయి. ఫేస్ ప్యాక్స్ చర్మంలో పేరుకున్న డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తాయి. చర్మాన్ని హెల్దీగా చేస్తాయి. అందువల్ల వారానికోసారి ఫేస్​ప్యాక్​ వేసుకోవాలి. ఇందుకోసం రెండు చార్ కోల్ క్యాప్సుల్స్ తీసుకొని, వాటిని రోజ్ వాటర్​లో కలిపి పేస్ట్​లా చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. పావుగంట తర్వాత శుభ్రం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం మృదువుగా, హెల్దీగా ఉంటుంది.