
మెర్సిడెస్ -బెంజ్ ఇండియా జీక్లాస్‌లో డీజిల్ వేరియంట్‌ను మళ్లీ మార్కెట్‌లోకి తెచ్చింది. రూ.2.9 కోట్ల ధరతో వచ్చిన జీ 450డీలో, 367హెచ్‌పీ పవర్, 750 ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేసే 3.0 లీటర్ మైల్డ్-హైబ్రిడ్ డీజిల్ ఇంజన్ ఉంది. ఈ కారు ధర జీక్లాస్ ఈవీ కంటే రూ.20 లక్షలు తక్కువ. కానీ డిఫెండర్ 110 డీజిల్ కంటే రూ.1.6 కోట్లు ఎక్కువ. జీ450 డీ - గంటకు 100కిమీల స్పీడ్‌ను 5.8 సెకన్లలో అందుకోగలదు. టాప్ స్పీడ్ 210కి.మీ పెర్ అవర్. 241ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 700ఎంఎం ఫోర్డింగ్ డెప్త్ ఉంటుందని బెంజ్ చెబుతోంది.