కరోనాలో కొత్త రకం : మెర్స్ (MERS) వైరస్ ను గుర్తించిన దుబాయ్.. WHO అలర్ట్

కరోనాలో కొత్త రకం : మెర్స్ (MERS) వైరస్ ను గుర్తించిన దుబాయ్.. WHO అలర్ట్

కరోనా వైరస్‌లో మళ్లీ మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ప్రాణాలు తీసే మెర్స్  (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ) కరోనావైరస్ పాజిటీవ్ కేసు తాజాగా గల్ఫ్ దేశం అబుదాబీలో వెలుగు చూసింది.  అబుదాబిలోని అల్ ఐన్ నగరానికి చెందిన 28 ఏళ్ల యువకుడికి ఈ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ సోకినట్లు పరీక్షల్లో వెల్లడైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ ప్రాణాంతకరమైన వ్యాధితో జూన్  నెలలో ఆసుపత్రిలో చేరినట్లు WHO పేర్కొంది. ఈ రోగికి కాంటాక్ట్‌లో ఉన్న 108 మందిని కూడా ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. అయితే వారిలో ఇప్పటివరకు సెకండరీ ఇన్‌ఫెక్షన్లు ఏవీ రాలేదని తేల్చారు. 

MERS-CoV అంటే ఏమిటి?

 కరోనా వైరస్‌లలో చాలా రకాలున్నాయి. అయితే మనుషుల్లో వ్యాపించే కరోనా రకాలు మాత్రం 229E, NL 63,OC43, HKU1, మెర్స్ కోవ్, సార్స్‌-కోవ్‌, సార్స్‌-కోవ్‌2 వంటి అనేక రకాల వైరస్ లు ఉన్నాయి.  మెర్స్‌-కోవ్‌ అంటే 'మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ (మెర్స్‌), కరోనా వైర్‌ (కోవ్‌) అని అర్థం. ఇది వైరల్ శ్వాసకోశ వ్యాధి. తొలుత మధ్య ఆసియాలో తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధి రూపంలో బయటపడింది. అందుకే దానికి ఆ పేరు పెట్టారు. ఇది అత్యంత ప్రాణాంతకమైన వ్యాధి.  ఇది సాధారణంగా ఒంటెలు, ఇతర జంతువులకు సోకుతుంది. ఈ వ్యాధి సోకిన జంతువులు లేదా జంతువుల ఉత్పత్తుల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఇది కరోనా వైరస్ వలనే  ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపిస్తుంటుంది.  ఈ వ్యాధి సోకిన వారిలో 37 శాతం మరణాల రేటు ఉంటుంది. గతంలో మెర్స్ కరోనా వైరస్ వల్ల 936 మంది రోగులు మరణించడంతో ఇప్పుడు మరోసారి ఆందోళన నెలకొంది. 

MERS-CoV  లక్షణాలు:

MERS-CoV  వైరస్ సోకిన వ్యక్తులకు జ్వరం, దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి  కొన్ని సందర్భాల్లో న్యుమోనియా లేదా మూత్రపిండాల వైఫల్యానికి కూడా దారితీయవచ్చు.  తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారు.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు లేదా తక్కువ రోగనిరోధక వ్యవస్థలు ఉన్నవారికి ఈ వైరస్ సోకితే తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. 

MERS-CoV చరిత్ర (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనావైరస్)

WHO ప్రకారం ఈ వ్యాధి తొలుత  2012లో గుర్తించబడింది. ఇప్పటి వరకు  MERS 2,605 కేసులు గుర్తించబడ్డాయి. వీటిల్లో 936 మరణాలు సంభవించాయి. అల్జీరియా, ఆస్ట్రియా, బహ్రెయిన్, చైనా, ఈజిప్ట్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, ఇటలీ, జోర్డాన్, కువైట్, లెబనాన్, మలేషియా, నెదర్లాండ్స్, ఒమన్, ఫిలిప్పీన్స్, ఖతార్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, యునైటెడ్ కింగ్‌డమ్, సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్‌డమ్, సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్‌డమ్, సౌదీఅరేబియా, యునైటెడ్ కింగ్‌డమ్, సౌదీఅరేబియా. రాష్ట్రాలు, యెమెన్ దేశాల్లో ఈ మెర్స్ కేసులను గుర్తించినట్లు WHO ప్రకటించింది. 

మెర్స్ వ్యాధి సోకకుండా ఉండాలంటే..

ప్రాణాంతకమైన మెర్స్ వ్యాధి సోకకుండా ఉండాలంటే  ప్రజలు శుభ్రత పాటించాలి.  MERS-CoV లేదా ఇతర శ్వాసకోశ వ్యాధుల బారిన పడిన  వ్యక్తులతో సన్నిహితంగా ఉండొద్దు. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. తరచూ చేతులతో  ముఖాన్ని తాకొద్దు.  జంతువులు, ఒంటె మాంసం, ఒంటె పాలు వంటి జంతు ఉత్పత్తులతో తినొద్దు. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోటిని, ముక్కును కవర్ చేసుకోవాలి.