బ్లూటిక్ ఛార్జీలు ప్రకటించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్.. ధర ఎంతంటే?

బ్లూటిక్ ఛార్జీలు ప్రకటించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్.. ధర ఎంతంటే?

ట్విట్టర్ బాటలోనే సోషల్ మీడియా దిగ్గజాలన్నీ నడుస్తున్నాయి. ట్విట్టర్ ప్రవేశపెట్టిన బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ ను మెటా కూడా తన అనుభంద యాప్స్ లో ప్రవేశపెట్టింది. భారత్ లో ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ల్లో విధించే బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ వివరాలను ప్రకటించింది మెటా.  మొబైల్‌ యాప్‌లకు, డెస్క్‌టాప్‌ బ్రౌజర్లకు వేర్వేరుగా ధరలు నిర్ణయించింది. మొబైల్ యాప్ ద్వారా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వాడేవాళ్లు.. నెలకు రూ.1450, డెస్క్ టాప్ యూజర్లు నెలకు రూ.1099 చెల్లించాల్సి ఉంటుంది.

కాగా, ఇప్పటివరకు నెలవారి సబ్ స్క్రిప్షన్ సౌకర్యం అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పటినుంచి భారత్ లో కూడా అందుబాటులోకి వచ్చింది.  మెటా-వెరిఫైడ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలంటే.. 

ముందు బ్రౌజర్ లో about.meta.com/technologies/meta-verified అని సెర్చ్ చేయాలి.  అందులో ఫేస్ బుక్ లేదా ఇన్ స్టాగ్రామ్ పై క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. తర్వాత ‘వెయిటింగ్ లిస్ట్‌లో చేరండి’అని ఉన్న ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీ అకౌంట్ వెరిఫై అయిన తర్వాత మీకు ఈమెయిల్ ద్వారా బ్లూటిక్  వచ్చినట్లు మెసేజ్ వస్తుంది.