న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) తాజాగా ఏర్పాటు చేసిన ఏఐ కంపెనీలో మెటా ప్లాట్‌ఫామ్స్ సబ్సిడరీ ఫేస్‌బుక్ ఓవర్‌సీస్ 30 శాతం వాటాను దక్కించుకుంది. రిలయన్స్ ఎంటర్‌ప్రైజ్ ఇంటెలిజెన్స్(ఆర్‌ఈఐఎల్) లో ఆర్‌ఐఎల్ సబ్సిడరీ రిలయన్స్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్‌కు 70 శాతం, ఫేస్‌బుక్ ఓవర్‌సీస్‌కు మిగిలిన 30 శాతం వాటా దక్కింది.
రిలయన్స్, ఫేస్‌బుక్ కలిసి రూ.855 కోట్లను ఆర్‌ఈఐఎల్‌లో పెట్టుబడి పెట్టాయి. ఈ కంపెనీని భారతదేశంలో రిజిస్టర్ చేశారు. ఇది బిజినెస్‌లకు ఏఐ సేవలను డెవలప్ చేస్తుంది.
