Meta Layoffs : జాయిన్ అయిన మూడో రోజే.. ఉద్యోగం పీకేశారు

Meta Layoffs : జాయిన్ అయిన మూడో రోజే.. ఉద్యోగం పీకేశారు

మెటా మొదటి వేవ్ లే ఆఫ్ ప్రక్రియ మొదలుపెట్టింది. ఇందులో ఓ భారతీయ ఉద్యోగి కూడా ఉన్నాయి. జాబ్ లో జాయిన్ అయిన మూడో రోజే ఉద్యోగం నుంచి పీకేసేసరికి తన ఆవేదనంతా లింక్డిన్ ద్వారా పంచుకున్నాడు. కెనడాలోని మెటా కార్యాలయంలో ఉద్యోగం పొందిన విశ్వజిత్ జా.. వీసా కోసం ఎన్నో కష్టాలు పడి కెనడా చేరుకున్నాడు. జాబ్ లో జాయిన్ అయిన మూడో రోజే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. దాంతో చేసేదేమి లేక తిరిగి ఇండియాకి వచ్చాడు. విశ్వజిత్ జా ప్రస్తుతం ఫోన్ పేలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. 

మెటా మొదటి దశలో 11వేలమందిని, రెండవ దశలో 10వేల మందిని ఉద్యోగం నుంచి తొలగించింది. చాలామంది ఉద్యోగులు.. ట్విటర్, లింక్డ్ఇన్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తొలగించబడిన తర్వాత తమ కష్టాలను పంచుకుంటున్నారు. తాజాగా యాక్సెంచర్ కూడా రాబోయే ఏడాది నుంచి ఏడాదిన్నర కాలంలో 19 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది.