ఆఫీసులు ఖాళీ చేస్తున్న మెటా, మైక్రోసాఫ్ట్‌!

ఆఫీసులు ఖాళీ చేస్తున్న మెటా, మైక్రోసాఫ్ట్‌!

మాంద్యం భయంతో పలు దిగ్గజ ఐటీ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నంలో పడ్డాయి. అందులో భాగంగానే ఉద్యోగుల్ని తొలగించడం, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. కాస్ట్ కట్టింగ్ లో భాగంగా మెటా, మైక్రోసాఫ్ట్‌ సంస్థలు ఆఫీసుల్ని ఖాళీ చేస్తున్నట్లు సీటెల్‌ టైమ్స్‌ కథనం ప్రచురించింది. ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా, మైక్రోసాఫ్ట్ కంపెనీలు వాషింగ్టన్‌లోని కార్యాలయ భవనాలను ఖాళీ చేసినట్లు చెప్పింది. టెక్ సెక్టార్‌లో మార్పులు, ఆఫీస్‌ మార్కెట్‌లో నెలకొన్న ఒడిదొడుకుల కారణంగా సీటెల్‌లోని అర్బోర్ బ్లాక్ 333లోని 6 అంతస్తులు, బెల్లేవ్‌లోని స్ప్రింగ్ డిస్ట్రిక్ట్‌ బ్లాక్ 6లోని 11అంతస్తులను లీజ్ కు ఇచ్చేందుకు మెటా ప్లాన్ చేస్తోంది. 

కాలిఫోర్నియాకు చెందిన సోషల్ మీడియా కంపెనీ మెన్లో పార్క్‌తో పాటు లోకల్ ఆఫీస్ బిల్డింగుల లీజులను సమీక్షిస్తున్నట్లు సీటెల్ తెలిపింది. మైక్రోసాఫ్ట్‌ సైతం సిటీ సెంటర్ ప్లాజా బెల్లేవ్‌లోని 26 అంతస్తుల బిల్డింగ్  లీజు పునరుద్ధరించడంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పింది. ఈ బిల్డింగ్ లీజు 2024 జూన్ తో ముగియనుంది.