ఎంజీ లగ్జరీ ఈవీ సైబర్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌ వచ్చేసింది‌‌‌‌

ఎంజీ లగ్జరీ ఈవీ సైబర్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌ వచ్చేసింది‌‌‌‌

జేఎస్‌‌‌‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియాకి చెందిన లగ్జరీ  విభాగం ఎంజీ సెలెక్ట్ శుక్రవారం సైబర్‌‌‌‌స్టర్ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. దీని ఎక్స్‌‌‌‌ షోరూమ్  ధర రూ.72.49 లక్షలు (ప్రీ-బుకింగ్).  కొత్త బుకింగ్‌‌‌‌లకు అయితే రూ.74.99 లక్షలు. ఈ కారులో  77 కిలోవాట్‌‌‌‌ అవర్ బ్యాటరీని అమర్చారు. ఫుల్ ఛార్జ్‌‌‌‌పై  580 కి.మీ. రేంజ్ ఇస్తుందని అంచనా.  ఈ కారు  510 పీఎస్‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌, 725 ఎన్‌‌‌‌ఎం టార్క్‌‌‌‌ను ఉత్పత్తి చేస్తుంది.  3.2 సెకన్లలో 0 నుంచి -100 కి.మీ. వేగాన్ని అందుకుంటుందని కంపెనీ చెబుతోంది. సిజర్ డోర్స్, సాఫ్ట్-టాప్ రూఫ్, ట్రిపుల్ -స్క్రీన్ కాక్‌‌‌‌పిట్, బోస్ ఆడియో, లెవెల్ 2 ఏడీఏఎస్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.