MI vs DC: హిట్‌మ్యాన్ ఖాతాలో మరో రికార్డు.. వార్నర్, కోహ్లీ సరసన చేరిన రోహిత్ శర్మ

MI vs DC: హిట్‌మ్యాన్ ఖాతాలో మరో రికార్డు.. వార్నర్, కోహ్లీ సరసన చేరిన రోహిత్ శర్మ

వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ రోహిత్ శర్మ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ధాటిగా బ్యాటింగ్ చేసిన హిట్ మ్యాన్ 6 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 27 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుపై 1,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ 1,000 పరుగులు చేసిన రెండో ప్రత్యర్థి ఢిల్లీ క్యాపిటల్స్ కావడం గమనార్హం.

గతంలో రోహిత్ శర్మ.. కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టుపై 1,000 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్ టోర్నీ చరిత్రలో రెండు వేర్వేరు జట్లపై 1,000 పరుగుల చొప్పున చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. హిట్ మ్యాన్ కంటే ముందు డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీలు ఈ ఘనత సాధించారు. వార్నర్ పంజాబ్ కింగ్స్‌పై, కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్లపై 1,000 పరుగులు చేయగా.. కోహ్లీ ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నైసూపర్ కింగ్స్‌ జట్లపై 1,000 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో ప్రత్యర్థి జట్లపై 1000 పరుగులు చేసిన ఆటగాళ్లు

  • డేవిడ్ వార్నర్: పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌
  • విరాట్ కోహ్లీ: ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నైసూపర్ కింగ్స్‌
  • రోహిత్ శర్మ: ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌