హైదరాబాద్, వెలుగు: షాంఘ్రిలా ఇన్‌ఫ్రాకాన్ తన విల్లా ప్రాజెక్ట్ మై కాసాను హైదరాబాద్లో గురువారం (అక్టోబర్ 23) ప్రారంభించింది. పటాన్‌చెరు ఇస్నాపూర్ సమీపంలో 391 ప్రీమియం విల్లాలతో ఈ గేటెడ్ కమ్యూనిటీని నిర్మించనుంది. ప్రాజెక్ట్‌ను 18 నెలల్లో పూర్తి చేస్తామని, ఒక్కో ఇంటిని నిర్మాణం పూర్తైన 30 రోజుల్లో డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని షాంఘ్రిలా ఇన్‌ఫ్రాకాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ బొల్లినేని శీనయ్య చెప్పారు.
వేగం, క్వాలిటీ తమ ప్రత్యేకతలు అని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు హెచ్‌ఎండీఏ, రెరా ఆమోదం ఉందని, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)కు 10 నిమిషాల దూరంలో ఉంటుందని వివరించారు. కొనుగోలుదారులు మొత్తం ప్రాజెక్ట్ పూర్తి అయ్యే వరకు వేచి లేకుండానే తమ ఇండ్లలో నివసించవచ్చని అన్నారు. ఇంటి స్వాధీనానికి ముందు ఈఎంఐలు చెల్లించనవసరం లేదని ఆయన వివరించారు.
