ట్రంప్ ఒక రాంగ్ ప్రెసిడెంట్

ట్రంప్ ఒక రాంగ్ ప్రెసిడెంట్

అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా పనికిరారని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య, అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా అన్నారు. డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో జరిగిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘డొనాల్డ్ ట్రంప్ మన దేశానికి తప్పుడు అధ్యక్షుడు. ప్రస్తుతం దేశ ప్రజలు.. 2016 అధ్యక్ష ఎన్నికల పరిణామాలతో బతుకుతున్నారు. దేశానికి, దేశ ప్రజలకు ఏదైనా చేయడానికి అతనికి చాలా సమయం ఉంది. కానీ అతను ఏం చేయలేకపోయాడు. మనకోసం ఎటువంటి వ్యక్తి కావాలనుకున్నామో.. అలాంటి వ్యక్తి ట్రంప్ కాదు. 2016 అధ్యక్ష ఎన్నికలలో చాలామంది తమ ఓటును కరెక్ట్ గా ఉపయోగించుకోలేదు. ఎవరికో ఒకరికి వేశామా అన్నట్లు వేశారు. ఫలితంగా ప్రజాదరణ లేని వ్యక్తి అధ్యక్ష కార్యాలయానికి వెళ్లాడు. దాని ఫలితాన్ని అనుభవించిన ప్రజలు విసిగిపోయారు. దాంతో అమెరికా ప్రజలు మార్పును కోరుకుంటున్నారు’ అని ఆమె అన్నారు. అమెరికాలో అధ్యక్ష పదవికి నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లిక్ పార్టీ నుంచి డోనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ నుంచి జో బిడెన్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు.

For More News..

ఆన్‌లైన్ వేదికగా నేషనల్ స్పోర్ట్స్ డే

దేశంలో కొత్తగా 55 వేల కరోనా కేసులు.. 876 మంది మృతి

‘ఆదిపురుష్’ గా ప్రభాస్