భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీ ముందుకొచ్చింది. రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడికి సంసిద్ధత వ్యక్తం చేసింది. మంగళవారం(డిసెంబర్9) ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లభేటీ అయ్యారు. ఈ భేటీలో పెట్టుబడులకు అంగీకారం జరిగింది. ఏఐ రంగంలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టనుంది. ఆసియాలోనే ఇది అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్ కావడం విశేషం.
పెట్టుబడుల పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ సిద్దంగా ఉందని, దేశ ఆశయాలకు మద్దతు ఇచ్చేందుకు ఇండియా ఏఐ ఫస్ట్ ఫ్యూచర్‌కు అవసరమైన మౌలికసదుపాయాలు, నైపుణ్యాలు, సామర్థ్యాలను నిర్మించడంలో సహాయపడటానికి 17.5 బిలియన్ల పెట్టుబడి నిబద్ధతకు కట్టుబడి ఉన్నామని మైక్రోసాఫ్ట్ సీఈవో నాదెళ్ల Xలో పోస్ట్ చేశారు.

