చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ను గెలిపించాలె : వివేక్ వెంకటస్వామి

చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ను గెలిపించాలె : వివేక్ వెంకటస్వామి

చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. మందమర్రి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జెడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దపల్లి మాజీ ఎంపీ జి. వివేక్ వెంకటస్వామి, ఆయన కుమారుడు వంశీ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెన్నూరు నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాలు, గ్రామాలు, పట్టణాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ఆటో యూనియన్ లీడర్లు, పలు కులసంఘాల పెద్దలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి వివేక్ వెంకటస్వామి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జి. వివేక్ మాట్లాడారు. రాబోయే ఎలక్షన్స్ లో చేతి గుర్తుకు ఓటు వేసి.. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. 

బీఆర్ఎస్ పార్టీ క్యాతనపల్లి టౌన్ ప్రెసిడెంట్ ఎండీ అబ్దుల్అజీజ్ కాంగ్రెస్ కు మద్దతు పలికారు. మందమర్రి ఎంపీపీ బొలిశెట్టి కనుకయ్య, మాజీ సర్పంచి కిషన్​రావు, చిర్రకుంట సర్పంచి ఓడ్నాల కొమురయ్య, మాజీ సర్పంచి గోదారి రాజేశ్, మాజీ ఎంపీటీసీలు రాంటెంకి విజయ, దుర్గం కుమార్, వార్డు మెంబర్లు ఓడ్నాల రజిత, బూనేని మంజుల, రాంటెంకి తిరుపతి, దుర్గం సమేందర్, రాష్ట్ర లీడర్ గుడ్ల రమేశ్, అర్జున్, కాసర్ల శ్రీనివాస్, ఎండి.జలీల్, మంద తిరుమల్ రెడ్డి, గజె రవి, మహాదేవుని రమేశ్, మందమర్రి టౌన్ బీజేపీ జనరల్ సెక్రటరీ గడ్డం శ్రీనివాస్, బీజేవైఎం ప్రెసిడెంట్ ఓరుగంటి సురేందర్, మేకల తిరుపతి, గద్దె రాములు, మందమర్రి ఆటో యూనియన్ డ్రైవర్స్ పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.