ప్రజల కోరిక మేరకే చెన్నూరు వచ్చా : వివేక్ వెంకట స్వామి

ప్రజల కోరిక మేరకే చెన్నూరు వచ్చా  :  వివేక్ వెంకట స్వామి

కాళేశ్వరం పేరుతో కేసీఆర్​కోట్లు దోచుకున్నాడని కాంగ్రెస్​నేత, పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్​ వివేక్​వెంకటస్వామి మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజవర్గం మందమర్రిలో ఏర్పాటుచేసిన సభలో వివేక్ మాట్లాడారు. ‘కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్​పేరుతో బీఆర్ఎస్​సర్కార్ లక్ష కోట్లు దోచుకుంది. ఓటర్లను డబ్బులతో కొనేందుకు కేసీఆర్​రెడీ అవుతున్నడు. ఇక నుంచి ఆయన ఆటలు సాగవు. ప్రజలు కోరుకున్నారనే అసెంబ్లీ బరిలో ఉంటున్న. కేసీఆర్ ఓదేలును, నన్ను రోడ్డు మీద పడేసిండు. ఇప్పుడు కేసీఆర్ ను ఇద్దరం కలిసి రోడ్డున పడేస్తం. గతంలో చివరి క్షణంలో టికెట్ ఇస్తా అని  మోసం చేసిండు. కుటుంబ పాలనలో నాయకుల గొంతు కోయడం కొత్తదేమి కాదు. ప్రాణహిత ప్రాజెక్టు గ్రావిటీ ప్రాజెక్టు అది మా తండ్రి హాయాంలో తెచ్చారు. ఇప్పుడు కమీషన్ ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాళేశ్వరం డబ్బుల కోసమే కట్టారని నివేదిక ఇచ్చింది. ముఖ్యమంత్రి పూర్తిగా అవినీతిలో కురుకుపోయిండు. ముఖ్యమంత్రిని ఓడగొట్టేందుకు ఇదే కరెక్ట్ సమయం. కేసీఆర్ ఓటుకు డబ్బులిస్తే తీసుకోవాలి. అవి జనాల పైసలు. పోలీసులు ఒత్తిళ్లు తెచ్చిన, కేసులు పెట్టిన బయపడొద్దు. చేతి గుర్తుకు ఓటేసి గెలిపించండి’ వివేక్​కోరారు.