
ఉక్రెయిన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో 22 మంది ట్రైనీ సైనికులు మృతిచెందారు. ఈశాన్య ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ వైమానిక దళ విశ్వవిద్యాలయం నుండి శిక్షణా క్యాడెట్లను తీసుకువెళుతున్న విమానంలో 27 మంది ఉన్నారు. ఈ విమానం గాలిలో ఉండగా ఇంజన్ ఫెయిల్ కావడంతో.. ల్యాండింగ్ సమయంలో మంటలు చెలరేగి రోడ్డు పక్కన కుప్పకూలింది.
‘ఏఎన్-26 మిలటరీ విమానం సైనిక విమానాశ్రయానికి 2 కి.మీ దూరంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 22 మంది చనిపోగా.. ఇద్దరు గాయపడ్డారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చర్యలు కొనసాగుతున్నాయి’ అని అంతర్గత మంత్రి అంటోన్ గెరాష్చెంకో తెలిపారు.
For More News..