పరుగుల వీరుడు మిల్కాసింగ్ మృతి

పరుగుల వీరుడు మిల్కాసింగ్ మృతి

 

పరుగుల వీరుడు, లెజండరీ అథ్లెట్‌ మిల్కాసింగ్‌ (91) కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన కోలుకున్న తర్వాత వచ్చిన సమస్యలతో చండీగర్‌లోని పీజీఐఎంఆర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయనకు శుక్రవారం రాత్రి ఒక్కసారిగా జ్వరం పెరగి.. ఆక్సిజన్ లెవల్స్ తగ్గినట్లు వైద్యులు తెలిపారు. మిల్కాసింగ్‌కు మే 20 కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత లక్షణాలు ఎక్కువ కావడంతో మే 24న మొహాలిలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరారు. అనంతరం పరిస్థితి విషమించడంతో జూన్ 3న చండీగర్‌లోని పీజీఐఎంఆర్‌కు తరలించి ఐసీయూలో అడ్మిట్ చేశారు.

కాగా.. ఆయన భార్య నిర్మలా కౌర్ కూడా కరోనాతో చికిత్స పొందుతూ ఫోర్టిస్ ఆస్సత్రిలోనే జూన్ 13న మృతిచెందారు. ఆమె ఇండియా విమెన్స్‌‌ వాలీబాల్‌‌ టీమ్‌‌ మాజీ కెప్టెన్‌‌, లెజెండరీ స్ప్రింటర్‌‌‌గా పేరొందారు. మే 24న మిల్కాసింగ్ హాస్పిటల్లో అడ్మిట్‌‌ అయితే.. రెండు రోజుల తర్వాత, మే 26న నిర్మల కూడా పాజిటివ్‌‌ రిజల్ట్‌‌తో అదే ఆస్ప్రతిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో గత ఆదివారం కన్నుమూశారు. ఆమె చనిపోయిన అయిదు రోజులకే మిల్కా సింగ్ కూడా మృతి చెందడం ఆయన కుటుంబంలో విషాదాన్ని నింపింది.