
హైదరాబాద్, వెలుగు: మాధాపూర్ మినర్వా హాల్స్‌లో “మిల్లెట్ మదర్స్” కార్యక్రమాన్ని మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ ప్రారంభించింది. గృహిణులు మిల్లెట్ ఆధారిత లంచ్ బాక్స్‌లు తయారు చేసి కార్పొరేట్ ఉద్యోగులకు సరఫరా చేయడం ద్వారా ఆరోగ్యం, ఆదాయాన్ని పొందొచ్చు. దీనిపై 60 మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సినీ నటి లయ బ్రాండ్ అంబాసిడర్‌గా పాల్గొన్నారు. మిల్లెట్స్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందిన అనుభవాన్ని పంచుకున్నారు.