
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని ప్రభుత్వ స్కూళ్లలో మిడ్‌డే మీల్స్ స్కీమ్‌లో భాగంగా మిల్లెట్లు అందించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. మొదట రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఈ స్కీమ్‌ను అమలు చేయనున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో మిల్లెట్స్‌ను చేర్చాలని ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని, అది ఇప్పుడు ఆమోదం పొందిందని సీఎం భూపేష్ బాఘేల్ శనివారం రాత్రి ట్విట్టర్‌లో తెలిపారు. ఈ సందర్భంగా తాను కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలోని 12 జిల్లాల్లో స్కూల్ విద్యార్థులకు సోయా చిక్కీ స్థానంలో వారానికి నాలుగు రోజులు మిల్లెట్ ఆధారిత ఫుడ్‌ను అందజేస్తామని తెలిపారు. ప్రధాన మంత్రి పోషణ్ శక్తి యోజన కింద సోయా చిక్కీకి బదులుగా మిల్లెట్ ఫుడ్‌ను అందజేయాలని రాష్ట్ర పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ డైరెక్టరేట్ కేంద్రానికి గతంలో ప్రతిపాదన పంపిందని, దీనికి ఇప్పుడు ఆమోదం లభించిందని ఓ అధికారి వెల్లడించారు.