ఆస్ట్రేలియాలో ఇంటర్నెట్ బ్రేక్.. 12 గంటలు దేశం అల్లాడిపోయింది

ఆస్ట్రేలియాలో ఇంటర్నెట్ బ్రేక్.. 12 గంటలు దేశం అల్లాడిపోయింది

టెక్ యుగంలో ఇంటర్నెట్ నిత్యజీవితంలో ఓ భాగమైంది. ప్రపంచవ్యాప్తంగా అన్నిరంగాల్లో ఇంటర్నెట్ ప్రాధాన్యత ఎంతో అందరికి తెలుసు..బ్యాంకింగ్, రవాణా, మెడికల్, ఆస్పత్రులు, ఐటీ సెక్టార్..ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగం ఇంటర్నెట్ లేనిదే ముందుకు సాగదు.. స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ కావాల్సిందే.. మరి రోజంతా ఇంటర్నెట్ సేవలు ఆగిపోతే.. ఊహించుకోండి పరిస్థితి ఎలా ఉంటుందో.. సరిగ్గా అలాంటి పరిస్థితే.. ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. బుధవారం(నవంబర్ 8) ఒక్కసారిగా ఆస్ట్రేలియాలో ఇంటర్నెట్ కు అంతరాయం ఏర్పడింది.  వివరాల్లోకి వెళితే.. 

ఆస్ట్రేలియాలోని ప్రముఖ టెలి కమ్యూనికేషన్స్ సంస్థ ఆప్టస్ నెటవర్క్ వైఫల్యం కారణంగా మిలియన్ల కొద్ది ఆస్ట్రేలియన్లు ఇంటర్నె్ట్, కమ్యూనికేషన్ లేకుండా ఇబ్బందులు పడ్డారు. ఇంటర్నెట్ నిలిచిపోవడంతో రవాణ సేవలు, మెడికల్ ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోయాయి.మరోవైపు బ్యాంకింగ్ రంగం కూడా స్తంభించిపోయింది. 

ఆప్టస్.. ఆస్ట్రేలియాలో అతిపెద్ద రెండో నెట్ వర్క్ ప్రొవైడర్.దీనిలో తాజాగా ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల 10 మిలియన్ల ఆస్ట్రేలియన్లు ఇబ్బందులకు గురయ్యారు. వేలాది వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. తిరిగి ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించేందుకు దాదాపు 12 గంటల సమయం పట్టింది. 

ఇంటర్నెట్ నిలిచిపోవడంలో ఎలాంటి సైబర్ దాడులు లేవని.. కేవలం సాంకేతిక లోపం వల్లే  మొబైల్, ఇంటర్నెట్ సేవలపై ప్రభావం పడిందని ఆప్టస్ ప్రకటించింది. నెట్ వర్క్ వైఫల్యానికి సారీ కూడా చెప్పింది. నెట్ వర్క్ ను తిరిగి త్వరగా పునరుద్దరించేందుకు మా బృందాలు కష్టపడి పనిచేశాయని సంస్థ తెలిపింది. అయితే ఈ వైఫల్యానికి కారణంగా పాక్షికంగా ఉద్యోగాల్లో కోత కారణమని యూనియన్లు అంటున్నాయి.. అది వాస్తవం కాదని ఆప్టస్ ప్రకటించింది.