HDFC ఖాతా ఓపెన్ చేయాలనుకునే వారికి బిగ్ షాక్.. మినిమమ్ బ్యాలెన్స్‌‌ భారీగా పెంపు

HDFC ఖాతా ఓపెన్ చేయాలనుకునే వారికి బిగ్ షాక్.. మినిమమ్ బ్యాలెన్స్‌‌ భారీగా పెంపు

హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లలో మెయింటైన్ చేసే మినిమమ్‌‌ బ్యాలెన్స్‌‌ను రూ.10 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది.  మెట్రో, అర్బన్ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌లలో కొత్త సేవింగ్స్ ఖాతా తెరిచే వారు రూ.25 వేల మినిమమ్ బ్యాలెన్స్​ను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ రూల్‌‌‌‌‌‌‌‌ను ఈ నెల 1 నుంచి పరిగణనలోకి తీసుకుంటారు. తాజా మార్పు కేవలం కొత్త ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తుంది. 

కొత్త ఖాతాలలో మినిమమ్‌ బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌  రూ.25 వేల కంటే తక్కువ ఉంటే, 6శాతం లోటు లేదా రూ.600 (ఏది తక్కువైతే అది) జరిమానాగా విధిస్తారు. సెమీ-అర్బన్‌‌‌‌‌‌‌‌లో రూ.5 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,500 గా ఉండాలి. దీనిని మార్చలేదు. ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ, కెనరా బ్యాంక్, పీఎన్‌‌‌‌‌‌‌‌బీ సాధారణ సేవింగ్స్ ఖాతాలకు మినిమమ్‌ బ్యాలెన్స్ నియమాన్ని  తొలగించాయి.