- మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల టౌన్, వెలుగు: ఇందిరా మహిళా శక్తి ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మెగా రుణమేళా కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, మహిళాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చాలా రకాల పథకాలను మహిళల పేరుమీదనే అమలు చేస్తోందన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ మహిళలు తమ స్వశక్తితో ఎదిగి ఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు.
అనంతరం జిల్లాలోని 350 మహిళా సంఘాలకు రూ.36 కోట్ల జంబో చెక్ ను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీవో రఘువరన్, సంబంధిత అధికారులు, మహిళా సమాఖ్య సభ్యులు, బ్యాంకు మేనేజర్లు, మహిళలు పాల్గొన్నారు.
సొంతింటి కల సాకారం
ఇందిరమ్మ రాజ్యంలోనే నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుతోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం పెగడపల్లి మండలం ల్యాగలమర్రి గ్రామంలోని ఇందిరమ్మ ఇల్లు పూర్తి కాగా.. గృహ ప్రవేశానికి కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి మంత్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ ఇండ్లు ఇస్తామన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కుందేల లక్ష్మి– రాజు దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈ భాస్కర్, తహసీల్దార్, ఎంపీడీవోలు, అధికారులు పాల్గొన్నారు.
