మత్స్యకారుల సంక్షేమానికి కృషి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

మత్స్యకారుల సంక్షేమానికి కృషి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల టౌన్/ధర్మపురి, వెలుగు: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామంలోని కంపెల్లి చెరువులో 48,500 చేప పిల్లలను మంత్రి చెరువులోకి వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చేపల పెంపకం కీలకమైందని, అందుకే 100 శాతం సబ్సిడీతో చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

 చెరువుల పునరుద్ధరణ, నీటి నిల్వ సామర్థ్యాల పెంపు, మార్కెట్ సదుపాయాల విస్తరణ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. జిల్లాలో 765 చెరువుల్లో రూ.2.44 కోట్లతో 1.69 కోట్ల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.  అనంతరం వెల్గటూర్ మండలానికి చెందిన 29 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్‌‌‌‌‌‌‌‌ అందజేశారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారి సురేశ్‌‌‌‌‌‌‌‌బాబు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మత్స్యకారులు పాల్గొన్నారు.