
విభజన చట్టంలోని 2200 కోట్లు ఇంకా విడుదల కాలేదన్నారు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క.జీఎస్టీ సమావేశంలో పాల్గొన్న భట్టి.రాష్ట్రాలకు వెసులుబాటు ఇవ్వాలని కోరామన్నారు. మూలధనం వ్యయాన్ని పెంచి పథకాలు కొనసాగించాలన్నారు. ఆదాయ పంపిణీలో అసమానతలు పెరిగిపోతున్నాయన్నారు. కేంద్ర పన్నులతో రాష్ట్రాల ఆదాయం తగ్గిందని చెప్పారు. కొన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలపై పున:సమీక్షించాలని కోరారు. సర్ చార్జీలు, సెస్ లపై 10 శాతం మించి ఉండొద్దన్నారు.
స్కిల్ డెవల్ పమెంట్ సెటర్లను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు మంత్రి భట్టి విక్రమార్క. వెనుబడిన జిల్లాలకు నిధుల కేటాయింపు పెంచాలన్నారు.తెలంగాణకు మరిన్ని నవోదయ పాఠశాలలు పెంచాలన్నారు. మూసీ డెవ్ లప్ మెంట్ ప్రాజెక్టుకు కేంద్ర సహకారం కోరామన్నారు. ఫర్టిలైజర్స్ పై జీఎస్టీ 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని కోరినట్లు చెప్పారు. రాష్ట్ర సమస్యలపై మరోసారి నిర్మలాసీతారామన్ ను కలుస్తామని వెల్లడించారు భట్టి.