విలీన గ్రామాల ప్రస్తావన తెస్తే హైదరాబాద్‌‌ను ఏపీలో కలపాలి

విలీన గ్రామాల ప్రస్తావన తెస్తే హైదరాబాద్‌‌ను ఏపీలో   కలపాలి

విలీన గ్రామాల ప్రస్తావన తెస్తే ఏపీలో హైదరాబాద్ కలపాలని డిమాండ్ చేస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విలీన గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తే.. ఏపీని కూడా తెలంగాణలో కలపాలని అడుగుతామని కీలక వ్యాఖ్యలు చేశారు. విలీన గ్రామాల ప్రజలకు ఏమీ చేయాలో తమకు తెలుసన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఏపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు విమర్శలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. భద్రాచలానికి ఎలాంటి ముప్పు లేకుండా పోలవరం ఎత్తు తగ్గించాలని గతంలోనే కోరామని ఆయన గుర్తు చేశారు. 

దీనిపై మంత్రి బోత్స స్పందించారు. పువ్వాడ అజయ్ అనవసర విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. ఏపీ రాష్ట్రంలో  ఆదాయం తగ్గిందని.. అయితే హైదరాబాద్ లో కలిపేస్తారా సూటిగా ప్రశ్నించారు. ఏపీ మంత్రి అంబటి రాంబాబు కూడా స్పందించారు. గోదావరికి వరదలు వచ్చినప్పుడల్లా కొత్త కొత్త వివాదాలు తీసుకరావడం సబబు కాదన్నారు. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం పట్టణానికి ఎలాంటి ముప్పు లేదని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుకు సంబంధించి అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్రం అనుమతులిచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.