
జోగిపేట, వెలుగు: నియోజకవర్గంలోని అన్ని స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన ఆందోల్లోని కేజీబీవి స్కూల్ ను పరిశీలించారు. డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్ , కిచెన్, మెనూను పరిశీలించారు. స్టూడెంట్స్తో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్, హెల్త్ కేర్ హబ్ గా అభివృద్ధి చేస్తామన్నారు. నర్సింగ్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా పాలిటెక్నిక్ కాలేజీ, నాందేడ్ జాతీయ రహదారి నిర్మాణ పనులను తనిఖీ చేశారు. రహదారి నిర్మాణం శరవేగంగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.