సీఎస్‌ఆర్‌‌ ఫండ్స్‌ వసూలు చేయండి : దామోదర రాజనర్సింహా

సీఎస్‌ఆర్‌‌ ఫండ్స్‌ వసూలు చేయండి : దామోదర రాజనర్సింహా
  •     మంత్రి  దామోదర రాజనర్సింహా

సంగారెడ్డి, వెలుగు :  జిల్లా అభివృద్ధికి సీఎస్‌ఆర్‌‌ ఫండ్స్ సేకరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రూపేశ్‌తో కలిసి మంత్రి సీఎస్ఆర్ ఫండ్స్ సేకరణపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..జిల్లాలోని వివిధ ఫ్యాక్టరీల యాజమాన్యాలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జిల్లా అభివృద్ధికి సీఎస్‌ఆర్‌‌ నిధులు వినియోగించేలా చూడాలన్నారు.  

సీఎస్ఆర్ నిధులను విద్య, వైద్య సదుపాయాల కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా హాస్టల్స్, ఆసుపత్రులు, అదనపు తరగతి గదులు, విద్యాసంస్థలు, ఆస్పత్రులలో కావాల్సిన ఇన్ఫాస్ట్రక్చర్‌‌ కోసం ఆ నిధులను వినియోగించాలన్నారు. జిల్లాలోని ఆయా పరిశ్రమల యాజమాన్యాలు సీఎస్ఆర్ కింద ఇవ్వాల్సిన నిధులు, ఇప్పటివరకు ఇచ్చినవి, ఇంకా ఇవ్వాల్సిన బకాయిలపై దృష్టి సారించాలన్నారు.

సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, పరిశ్రమల శాఖ జీఎం, ఎక్సైజ్, కార్మిక, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ , ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శాఖల అధికారులు, సీపీఓ, తదితరులు పాల్గొన్నారు.