
- మంత్రి దామోదర రాజనర్సింహ
రేగోడ్, వెలుగు: అధికారులు రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితా తయారుచేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. శనివారం మండల కేంద్రంలో రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొని చిన్నారులు, మహిళా కార్యకర్తలతో రాఖీ కట్టించుకున్నారు. అనంతరం మంత్రి తమ్ముడి కుమార్తె వివాహానికి మండల నాయకులను, కార్యకర్తలను, విలేకరులను ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మండలానికి ఇంకా ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు కావాలో చెబితే మంజూరు చేయిస్తాన్నారు. నిబంధనల ప్రకారం ఇండ్లు నిర్మించుకోవాలన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు కిషన్, మాజీ ప్రజాప్రతినిధులు యాదగిరి, శ్యామ్ రావు కులకర్ణి, చోటు మియా, విజయభాస్కర్, నరేందర్, పోలీస్ కృష్ణ, నాగేందర్రావు కులకర్ణి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.