
మహిళలను కోటీశ్వరులుగా మార్చాలన్న ఉద్దేశంతోనే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలతో పాటు వ్యాపారాలు చేసుకోవడానికి లోన్లు మంజూరు చేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క చెప్పారు. స్టూడెంట్లకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. శుక్రవారం ములుగు జిల్లా వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లో పర్యటించిన మంత్రి సీతక్క చల్వాయి మోడల్ స్కూల్‌లో కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు.
అలాగే చల్వాయి శిక్షణా కేంద్రంలో ఎస్‌హెచ్‌జీ మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసి, వెంకటాపూర్ మండలం జవహర్ నగర్‌లోని రామాలయం చుట్టూ ప్రహరీ గోడను ప్రారంభించారు. అనంతరం మోడల్ స్కూల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న టీచర్ల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లు పూర్తి చేశారన్నారు.
స్టూడెంట్లకు ఆధునిక, కంప్యూటర్ విద్య అందాలన్న ఉద్దేశంతో కార్పొరేట్ కంపెనీలను ములుగు జిల్లాకు తీసుకొస్తున్నట్లు చెప్పారు. ములుగు జిల్లాను అభివృద్ధిపథంలో తీసుకెళ్లే బాధ్యత తనదేనన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను మహిళలు వినియోగించుకొని ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, అడిషనల్ కలెక్టర్ సంపత్‌రావు, ఉషా కంపెనీ డిప్యూటీ మేనేజర్ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.