
కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని స్నేహితుడు రమేశ్, రజిత దంపతుల కూతురు దివ్య పెళ్లి వేడుకకు ఆదివారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అనంతరం గాంధీనగర్‌లోని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎన్ఎస్యూఐ నాయకుడైన పోతారపు సురేందర్, పుల్లా రమేశ్ ఇంటికి వెళ్లి వారితో కాసేపు మాట్లాడారు. మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు మహ్మద్ఆయూబ్, కాంగ్రెస్ జిల్లా ఎస్సీ సెల్కన్వీనర్కిన్నెర రవి, సందెల లాజర్, ఐత అరుణ్, తజముల్ఖాన్, దినేశ్, చాంద్‌పాషా, నూతన్, తదితరులున్నారు.