మార్కెట్‌కి తెచ్చిన 24 గంటలలో ధాన్యం కొనుగోలు చేస్తాం

మార్కెట్‌కి తెచ్చిన 24 గంటలలో ధాన్యం కొనుగోలు చేస్తాం

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. మార్కెట్‌కి తెచ్చిన 24 గంటలలో ధాన్యం కొనుగోలు చేస్తామని.. రైతులు ధాన్యం ఆరబెట్టి తేవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ శశాంక కూడా పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఈటల మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో ఆక్సీజన్, రెమిడేసివిర్ ఇంజెక్షన్స్ కొరత లేకుండా చూస్తున్నాం. ఈ నెల 20 తర్వాత రెమిడేసివిర్ ఇంజెక్షన్స్ కొరత లేకుండా చూస్తాం. వ్యాక్సిన్ తయారీదారులతో సీఎం కేసీఆర్, నేను మాట్లాడినం. రాష్ట్రంలో కొవిడ్ వాక్సిన్ కొరత ఉంది. రాష్ట్రానికి వాక్సిన్లు ఎక్కువగా సప్లై చేయాలని, దానిలో మొదటి ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ని కోరాం. 25 సంవత్సరాలు పైబడిన వారందరికీ కొవిడ్ వాక్సిన్ అందజేయాలని మంత్రిని కోరాం. రేమిడేసివిర్ ఇంజెక్షన్స్ ఎక్కడ బ్లాక్‌లో కొనొద్దు.. ఎమర్జెన్సీ‌లోనే వాడాలి. పద్ధతి ప్రకారం నడుచుకోని ప్రైవేట్  హాస్పిటల్స్‌పై చర్యలు తీసుకుంటాం. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోంది. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి.
లాక్‌డౌన్‌లు,  కర్ఫ్యూలు, 144 సెక్షన్లు ఏవీ ఉండవు’ అని మంత్రి అన్నారు.