పేద ప్రజల పెన్నిధి ఎన్టీఆర్

పేద ప్రజల పెన్నిధి ఎన్టీఆర్

హన్మకొండ: తెలుగువారి ఆత్మ గౌరవ ప్రతీక ఎన్టీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. శనివారం మాజీ సీఎం, విశ్వ విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... ఓ నటుడిగా, రాజకీయ నేతగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, నిరుపేదలకు ఇళ్ల వంటి పథకాలతో పేద ప్రజల పాలిట పెన్నిధిగా ఎన్టీఆర్  మారారన్నారు. ఇక ప్రజలను పట్టి పీడిస్తున్న జమీందారీ వ్యవస్థను రద్దు చేయడమే కాకుండా... మండల వ్యవస్థను ప్రవేశపెట్టి పాలనలో సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. ఎందరో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువకులకు ఎన్టీఆర్ చట్ట సభల్లో అవకాశం కల్పించారని గుర్తు చేశారు. 

మరిన్ని వార్తల కోసం...

బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోంది

సెలవుల్లో డాన్స్ పై స్టూడెంట్స్ ఆసక్తి