తెలంగాణ ఆడబిడ్డలు నవ్వితే కేసీఆర్ సంతోషిస్తారు

తెలంగాణ ఆడబిడ్డలు నవ్వితే కేసీఆర్ సంతోషిస్తారు

హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్‌లో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. చెక్కుల పంపిణీ అనంతరం గంగుల మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు బతకాలని కోరారు. కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ లాంటి పథకాలపై కొందరు విమర్శలు చేస్తున్నారని, ఆ పథకాలను కొనసాగించాలా లేదనేది ప్రజలు నిర్ణయించాలన్నారు. నాటి ప్రభుత్వాలు వెనుకబడిన వర్గాలకు పూర్తిస్థాయిలో విద్యను అందించలేదని దుయ్యబట్టారు. కానీ సీఎం కేసీఆర్ వారి కోసం 260 గురుకులాలలను స్థాపించారని కొనియాడారు. తెలంగాణ ఆడబిడ్డలు నవ్వితే కేసీఆర్ చాలా ఆనందపడతారని పేర్కొన్నారు.