యాదగిరి నర్సన్నను దర్శించుకున్న హరీష్ రావు

యాదగిరి నర్సన్నను దర్శించుకున్న హరీష్ రావు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత వారు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు మంత్రి హరీష్ రావు కుటుంబసభ్యులకు వేద ఆశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. యాదాద్రి ఆలయానికి మంత్రి హరీష్ రావుతో పాటుగా ఎంపీ బడగుల  లింగయ్య యాదవ్ , జెడ్పీ ఛైర్ పర్సన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి కూడా స్వామివారిని దర్శించుకున్నారు.