మత విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడిపే పార్టీ బీజేపీ

మత విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడిపే పార్టీ బీజేపీ

మత విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడిపే పార్టీ బీజేపీ అని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు . బీజేపీ అంటేనే కాపీ పేస్ట్ పార్టీ అని విమర్శించారు. తెలంగాణ పథకాలను కాపీ కొడుతూ కొడుతున్నారని హేళన చేశారు. ఢిల్లీ, హైదరాబాద్ గాంధీ భవన్ లో కూర్చుని మాట్లాడే నాయకులకు తెలంగాణలో నీళ్లు వస్తున్నాయా లేదా అన్న విషయం తెలుసా అని ప్రశ్నించారు. 

సిద్దిపేట క్యాంపు ఆఫీస్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన యువకులను మంత్రి హరీశ్ రావు పార్టీలో చేర్చుకున్నారు. వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు. ఆ తరువాత పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతీక చాకలి ఐలమ్మ అని కొనియాడారు.