రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన హరీష్ రావు

రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన హరీష్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరని కేంద్రాన్ని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లాలో  రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని ఆయన ప్రారంభించారు.  సంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాలకు గోదావరి నీళ్లు అందించే బాధ్యత తనదని హరీష్ రావు అన్నారు. మంజీరా నదిపై ఇప్పటికే 15 చెక్ డ్యాంలు నిర్మించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో అందోల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి మాటలు తప్ప చేతలుండవని విమర్శించారు.

ఇక గాంధీని కించపరిచిన ఘనత బీజేపీకే దక్కుతుందని హరీష్ రావు అన్నారు. నల్లచట్టాలను తెచ్చి వెనక్కి తీసుకున్నారన్న మంత్రి..పెద్దనోట్ల రద్దుతో ఏం సాధించారని నిలదీశారు. మోడీ హయాంలో రూపాయి విలువ భారీగా పతనమైందని..గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ ఎత్తివేసి సామాన్యలపై మరింత భారం మోపిందని మండిపడ్డారు. తాజాగా అగ్నిపత్ పేరుతో యువతను మోసం చేస్తున్నారని..సిపాయిలను కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదకన తీసుకోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా గుజరాత్ లో ప్రారంభిస్తున్నారని ఆరోపించారు.