
నార్సింగిలో టి డయాగ్నోస్టిక్ మినీ హబ్ ను ప్రారంభించారు వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా, ఎంపీ రంజిత్ రెడ్డి, MLC పట్నం మహేందర్ రెడ్డి, MLA ప్రకాశ్ గౌడ్ పాల్గొన్నారు. హైదరాబాద్ పరిధిలో టి డయాగ్నోస్టిక్ 9 మినీ హబ్స్ ని గ్రేటర్ హైదరాబాద్ లోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రారంభించారు. శేరిలింగంపల్లి, అల్వాల్, కుషాయిగూడ, పఠాన్ చెరువు, మలక్ పేట్, హయత్ నగర్, రాజేంద్ర నగర్, గోల్కొండ నార్సింగిల్లో.. డయాగ్నొస్టిక్ మినీ హబ్స్ ను ఏర్పాటు చేశారు.
నార్సింగిలో డయాగ్నొస్టిక్ మినీ హబ్ ను ప్రారంభించిన తర్వాత.. UPHC డాక్టర్లను మందలించారు మంత్రి హరీష్ రావు. ఆరుగురు డాక్టర్లు సహా మొత్తం 32 మంది సిబ్బంది ఉన్నా రోగుల సంఖ్య తక్కువగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒపీ రిజిస్టర్ కూడా సరిగ్గా మెయింటేన్ చేయకపోవడంపై సీరియస్ అయ్యారు వైద్యశాఖ మంత్రి.