మల్లన్న కల్యాణానికి మంత్రి హరీశ్ రావు

మల్లన్న కల్యాణానికి మంత్రి హరీశ్ రావు

కొమురవెళ్లి మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవానికి హాజరయ్యారు మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా  మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మంత్రి  ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. మల్లన్న దయవల్ల మల్లన్న సాగర్ పూర్తవడం దానిలో 10టి.యమ్. సీలు నింపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ కృషి, మల్లన్న దేవుని అనుగ్రహంతో రాష్ట్రంలో ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యాయన్నారు.  వచ్చే సంవత్సరం కల్యాణం వరకు స్వామివారికి 3కిలోల బంగారు కిరీటం ఏర్పాటుకు మంత్రి శ్రీనివాస్ యాదవ హామీ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. గత ఏడేళ్లుగా ఆలయంలో 33కోట్ల అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. కేంద్రం వ్యవసాయ రంగంలో నల్ల చట్టాల అమలు వాళ్ళ  700మంది రైతులు అమరులయ్యారన్నారు.  వ్యవసాయ శాఖ మంత్రి మాటల వల్ల రైతుల ఆత్మగోషిస్తుందన్నారు మంత్రి హరీశ్ రావు. రద్దు చేసిన వ్యవసాయ చట్టాలు మళ్ళీ తెస్తా అనడం విడ్డురంగా ఉందన్నారు. ఉత్తర ప్రదేశ్ ,పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికల కోసమే ఈ రైతు చట్టాలు ఉపసంహరించుకున్నారని మంత్రి ఆరోపించారు. ఎన్నికల అనంతరం మళ్ళీ వాటిని అమలు చేస్తారేమో దీనిపై ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రి స్ఫష్టత ఇవ్వాలన్నారు. రైతుల నల్ల చట్టాలపై ప్రధానమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి బేషరతుగా క్షేమాపణ చెప్పాలన్నారు.