మీకు సాయం ఎవరు చేయగలరో ఆలోచించి ఓటేయండి

మీకు సాయం ఎవరు చేయగలరో ఆలోచించి ఓటేయండి


అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ గెలవాలి


మంత్రిగా ఉన్నప్పుడే ఇండ్లు కట్టించలేని ఈటల రాజేందర్ రేపు ఏం చేస్తారని ప్రశ్నించారు మంత్రి హరీశ్ రావు. కేసీఆర్ హుజురాబాద్ కు కేటాయించిన 4వేల ఇళ్లలలో ఒక్క ఇల్లు కట్టించలేక పోయాడని తెలిపారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా మాట్లాడిన ఆయన..మీకు ఎవరికైనా డబుల్ బెడ్ రూం ఇల్లు వచ్చిందా? చెప్పండి అని ప్రజలను అడిగారు. కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వలేదని ఒకాయన అడుగుతున్నాడు.. కానీ ఆయన  అడగాల్సింది కేసీఆర్ ను కాదు.. ఈటలను అడగాలన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ గెలిచిపోయింది..ఇంకా చాలా మంది చేరారు.. నీకు డిపాజిట్ కూడా రాదన్నారు. 

 అంతేకాదు..ఒక వ్యక్తికి లాభం చేయడం కోసం 2 లక్షల 29 వేల మంది ఓటర్లు ఎందుకు నష్టపోతారని..ఈటలను ఉద్దేశించి అన్నారు మంత్రి హరీశ్ రావు. ఓటేసే ముందు మనకు సాయం ఎవరు చేస్తారో ఆలోచించి ఓటేయండని అన్నారు. హుజురాబాద్ లో కనీసం మహిళా సంఘాలకు ఒక్క భవనం ఈటల రాజేందర్ కట్టించలేదన్నారు. హుజరాబాద్ లో, జమ్మికుంటలో సౌకర్యాల కల్పన కోసం 70 కోట్లు కేటాయించాం తప్పా?57 ఏళ్లు నిండిన వారికి ఫించన్లు ఇప్పించడం తప్పా? మీరు కట్టకుండా వదిలేసిన ఇండ్లను పూర్తి చేసి వారికి ఇచ్చేందుకు ప్రయత్నించడం నా తప్పా? నేను ఏం తప్పు చేసానని ఈటల ప్రస్టేట్ అవుతున్నాడో చెప్పాలన్నారు. పట్టు జారినప్పుడే మనిషి నోరు జారుతాడన్న హరీశ్..నీవు ఎంత రెచ్చగొట్టినా.. మేము మాత్రం ప్రజలకు సేవ చేస్తామన్నారు.

మీకు సొంత స్థలాల్లో ఇండ్లు కట్టుకునేందుకు డబ్బులు ఇప్పిస్తానన్న హరీశ్.. ఈ పని ఎవరితో అవుతుందో ఆలోచించండని ప్రజలను కోరారు. దున్నపోతుకు గడ్డేసి బర్రెకు పాలు పిండితే రావన్నారు. అందుకే టీఆర్ఎస్ కు ఓటేయండన్నారు. రెండు కళ్లలాగా కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ మీకు సేవ చేస్తారని తెలిపారు. మీరు ఓటేయండి వచ్చే రెండేళ్లు మీకు సేవ చేస్తామన్న మంత్రి హరీశ్ రావు..మేం చేసినవి చెబుతుంటే.. బీజేపీ వాళ్లు మాయమాటలు చెప్పి ఓటడుగుతున్నారని ఆరోపించారు. బొట్టుబిల్లలు, మేకపోతులు, మద్యం సీసాలిస్తాం ఓటేయమని అడుగుతున్నారు. గెల్లు శ్రీనివాస్ కు కడుపులో పేగులు తప్ప..డబ్బులు లేవని..20 ఏళ్లు ఉద్యమం కోసం కష్టపడ్డాడు. మీకు ఆపద వచ్చి “అన్నా అంటే.. నేనున్నా” అంటాడు అని చెప్పారు. కల్లిబొల్లి కబుర్లు కాదు... పనిచేసే వాళ్లు కావాలని గుర్తించండి అని అన్నారు.