ఈటల మొసలి కన్నీరు నమ్మొద్దు

ఈటల మొసలి కన్నీరు నమ్మొద్దు
  • ఈటల మొసలి కన్నీరు నమ్మొద్దు: హరీశ్ రావు
  • తన ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిండు
  • ఇన్నేళ్లు అధికారంలో ఉండి ఒక్క ఇల్లు కట్టలేదని కామెంట్‌‌

కరీంనగర్, వెలుగు: ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టీఆర్ఎస్ పెంచి పెద్దచేస్తే.. ఆయనేమో మాకు అగ్గిపెడతా.. అంతు చూస్తా.. గోరీ కడతా అంటున్నారని, ఆయన తన అత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. తాము మహిళా సంఘాలకు ఇచ్చిన చెక్కులు చెల్లవని జూటా మాటలు మాట్లాడుతున్న ఈటల.. అన్నింటి రేట్లు పెంచిన బీజేపీకి ఎందుకు ఓటేయాలో చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయో చెప్పాకే ఓట్లు అడగాలన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళవారం ఇల్లందకుంటలోని సీతారాముల ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన ధూంధాంలో హరీశ్​  మాట్లాడారు. గెల్లు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను భారీ మెజారిటీతో గెలిపిస్తే ఇల్లందకుంట రాములోరి గుడికి రూ.10 కోట్లు తెచ్చి  డెవలప్​ చేస్తానన్నారు.

ఎగిరేది గులాబీ జెండానే
రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘతన టీఆర్ఎస్ పార్టీదేనని హరీశ్ అన్నారు. రైతుల కరెంట్ కష్టాలు పోగొట్టామని, ఎస్సారెస్పీ కాలువల్లో ఫుల్లుగా నీళ్లు పారిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వాలు భూమి శిస్తు, నీటి తీరువా వసూలు చేశాయే తప్ప.. తమలా రైతు భీమా, రైతు బంధు ఇవ్వలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం రేట్లు పెంచడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని, రాబోయే రోజుల్లో గ్యాస్ బండ ధర రూ.1,200 చేస్తారన్నారు. ఇన్నేళ్లు అధికారంలో ఉండి ఒక్క ఇల్లు కట్టని రాజేందర్.. ఈ రెండేళ్లలో ఎలా కడతాడని ప్రశ్నించారు. ఆరు సార్లు రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అవకాశం ఇస్తే ఎలాంటి అభివృద్ధి చేయకుండా తనకు అన్యాయం జరిగిందని నాటకమాడుతున్నాడని, మొసలి కన్నీరు కారుస్తున్నారని, ఆయన మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరారు. సెంటిమెంట్ వర్కవుట్ చేయాలని చూస్తున్న రాజేందర్​ను నమ్మవద్దన్నారు. ఈటల నడుమంత్రాన వచ్చిండు.. నడుమంత్రాన పోయిండని.. ఇల్లందకుంట గడ్డమీద ఎగురేది గులాబీ జెండానేనని అన్నారు.

తండ్రి లాంటి కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విమర్శలా..
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఈటలకు సీఎం కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారని, మంత్రిని చేశారని, అయినా రాజేందర్​ మాత్రం తండ్రి లాంటి కేసీఆర్​పై విమర్శలు చేస్తున్నారని, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి కులానికి, ప్రతి ఇంటికి ప్రభుత్వం నుంచి లబ్ధి జరిగిందని, కేసీఆర్ వచ్చాకే అందరూ బాగు పడ్డారని చెప్పారు.