29న కేసీఆర్, చిన్నజీయర్ చేతులమీదుగా కొండపోచమ్మ జలాశయం ప్రారంభం

29న కేసీఆర్, చిన్నజీయర్ చేతులమీదుగా కొండపోచమ్మ జలాశయం ప్రారంభం

సిద్దిపేట జిల్లా:  మే- 29న కొండపోచమ్మ జలాశయాన్ని సీం కేసీఆర్‌ ప్రారంభించనున్నారని తెలిపారు ఆర్థిక శాఖమంత్రి హరీష్ రావు. ఆయన ఇవాళ సిద్దిపేట జిల్లా, గజ్వేల్ మండలం దాతర్ పల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేశారు. తర్వాత నియంత్రిత పంటల సాగు అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన హరీష్.. మే-29న  ఉదయం 11:30 గంటలకు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా కొండ పోచమ్మ జలాశయంలోకి నీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కొండ పోచమ్మ ఆలయంలో చిన్నజీయర్‌ స్వామితో కలిసి సీఎం కేసీఆర్‌ హోమం నిర్వహించనున్నారని హరీష్‌ చెప్పారు. కొండపోచమ్మ సాగర్‌ ను పరిశీలించిన హరీష్.. ప్రభుత్వం సూచించిన పంటలను రైతులు సాగు చేసి.. అధిక దిగుబడి సాధించాలన్నారు మంత్ర హరీష్.

వ్యవసాయ దండగ కాదు.. వ్యవసాయం పండగ అని అనిపించాలనేది కేసీఆర్ కళ అన్నారు.  ఇది నియంత్రిత పంటల సాగు కాదని.. ప్రాధాన్యత పంటల సాగు అని అధికారులు రైతులకు వివరించాలన్నారు. దాతర్ పల్లి అంటేనే ఆదర్శ గ్రామమని.. ఇప్పటికే గజ్వేల్ నియోజకవర్గంలోని ఐదు మండలాలు ఏకగ్రీవ తీర్మానం చేసి, రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తయారయ్యిందన్నారు. ఈ గ్రామానికి చెందిన సత్యనారాయణ రైతు నాకు బస్తా బియ్యాన్ని పంపిండని చెప్పాడు. ఒకనాడు రెండు ఎకరాల పంట పెడితే అద్దెకర పొలం అయిన ఎండిపోయేదని.. ఎరువుల కోసం చెప్పులు పెట్టి ఉండేటోల్లం, నేడు ఆ పరిస్థితి లేదన్నారు మంత్ర హరీష్.

పంట పండించడం కోసం షావుకారు దగ్గరికి పోయి అప్పు తెచ్చుకునేటోళ్లమని.. నేడు అలాంటి ఇబ్బంది లేకుండా  5 వేల రూపాయల రైతుబందును ప్రభుత్వం ఇస్తుందన్నారు. పండించిన ప్రతి పంటకు కూడా మద్దతు ధర ఇస్తున్నామన్న ఆయన.. ఈ 10 రోజుల్లో 24 వేల రూపాయల ఋణమాపి చేస్తామన్నారు. లక్షలోపు ఉన్న ఋణమాపిని నెలలోగా మాపి చేస్తామని.. వాన కాలం మక్కలు పండిస్తే పంట నష్టం వస్తుందని.. అందుకే కంది పంటను సాగు చేసుకోవాలని సూచించారు హరీష్.

యువకులు ఫోన్లలో పేస్ బుక్కులు, పబ్జి గేములు బంజేసి, ఉన్న భూముల్లో మంచి పంటలు పండించేందుకు తల్లిదండ్రులకు సహకరించాలన్నారు. ఫోన్ కి మనం బానిస కాదు.. మనకు ఫోన్ బానిస కావాలన్నారు మంత్రి హరీష్ రావు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒక్క మర్డర్ దాచడం కోసం 9 హత్యలు చేశాడు

V6 ఛానెల్ చొరవతో బెంగళూరు నుండి స్వ‌గ్రామానికి త‌ల్లీకూతుళ్లు 

నెటిజన్లు ఫిదా : బర్రె పగ తీర్చుకుంది.. ఆకతాయిల నడుం ఇరకొట్టింది