
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తోందన్నారు రాష్ట్ర ఆర్థికమంత్రి హరీష్ రావు. దొడ్డు వడ్లు కొనబోమని కేంద్రం చెబుతోందన్నారు హరీష్. ఆదివారం సిద్ధిపేట రూరల్ మండలం అంకంపేటలో నిర్వహించిన సామూహిక గృహ ప్రవేశాల్లో హరీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన .. దేశంలోని బీజేపీ పాలిత 18 రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఇస్తేనే హుజురాబాద్ లో రాష్ట్ర బీజేపీ నేతలు ఓటు అడగాలన్నారు. బీజేపీ నేతలు మాయ మాటలు చెప్తున్నారని, వారి మాటలు నమ్మవద్దన్నారు. ప్రజలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. హుజురాబాద్ లో కాంగ్రెస్ లేనే లేదన్న ఆయన.. బీజేపీ, టీఆర్ఎస్ కు మధ్యనే పోటీ అన్నారు. ప్రజలు ఓటు వేసేందుకు వెళ్తున్నప్పుడు సిలిండర్‌కు దండం పెట్టండని మంత్రి హరీష్‌రావు అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచామని చెప్పడానికే బీజేపీ నేతలు పాదయాత్రలు చేస్తున్నారని హరీష్ సెటైర్లేశారు.