
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణ మారిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట గ్రామీణ మండలం పుల్లూరులో పర్యటించిన ఆయన..నూతన పోచమ్మ దేవాలయ విగ్రహా ప్రతిష్ఠ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత గ్రామ నాభిశిల బొడ్రాయి విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవానికి మంత్రి హాజరై.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పుల్లూరు గ్రామంలో బొడ్రాయి, పోచమ్మ దేవాలయ నిర్మాణాల కల నిజమైందని మంత్రి హరీష్ రావు అన్నారు. పుల్లూరు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు ఉండేవని పేర్కొన్నారు. డబుల్ లేన్ రోడ్డు-బైపాస్ రోడ్డు రావడంతో ఈ గ్రామానికి సరికొత్త అందమొచ్చిందని మంత్రి హరీష్ రావు అన్నారు.