మనఊరు మనబడికి రూ.7,300 కోట్లు విడుదల: హరీష్ రావు

మనఊరు మనబడికి రూ.7,300 కోట్లు విడుదల: హరీష్ రావు

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.4కోట్లతో గల్స్ హైస్కూలు, కాలేజీలో అభివృద్ధి పనులు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.  కార్పొరేట్ పాఠశాల మాదిరిగా ప్రభుత్వ కాలేజీలను తీర్చిదిద్దుతామని చెప్పారు. మన ఊరు, మన బడి కింద రాష్ట్రవ్యాప్తంగా రూ.7,300 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు హెల్త్ ఐజేన్ కిట్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని హరీష్ రావు తెలిపారు. ఈ మేరకు.. రాష్ట్రవ్యాప్తంగా రూ.70 కోట్లతో 11 లక్షల మంది బాలికలకు హెల్త్ ఐజేన్ కిట్స్ పంపిణీ చేస్తామని చెప్పారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మంచిగా చదువుకోవాలని సూచించారు. ఇక.. కాంట్రాక్ట్ లెక్చరర్లను కూడా రెగ్యులరైజ్ చేస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు.