తెలంగాణలో అలజడి సృష్టించేందుకే బై పోల్ తెచ్చిండ్రు : మంత్రి జగదీశ్ రెడ్డి

తెలంగాణలో అలజడి సృష్టించేందుకే బై పోల్ తెచ్చిండ్రు : మంత్రి జగదీశ్ రెడ్డి

మునుగోడులో కమ్యూనిస్టుల మద్దతుతోనే టీఆర్ఎస్ గెలిచిందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.  వామపక్షాలు తమ పార్టీకి మద్దతు ఇవ్వడమే గాక ప్రచారంలోనూ బాగా పనిచేశాయని కితాబిచ్చారు. బీజేపీ కుట్రలను జాతీయ స్థాయిలో ఎదుర్కోవాలనే వ్యూహంలో భాగంగానే  వామపక్షాలు తమకు అండగా నిలిచాయని  చెప్పారు. సీపీఎం కార్యాలయంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్ లో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడారు.  

తెలంగాణలో సజావుగా  సాగుతున్న కేసీఆర్ పాలనలో అలజడి సృష్టించాలనే దురుద్దేశంతోనే మునుగోడులో ఉప ఎన్నిక తెచ్చారని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. అందుకే సీపీఎం కార్యాలయానికి వచ్చి వారికి ధన్యవాదాలు తెలిపామని వెల్లడించారు. ఇకపై కూడా ప్రగతిశీల శక్తులు కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ సర్కారు తొలి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి మంత్రి జగదీశ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.