భారత్ను పరిపాలించే సత్తా కేసీఆర్, కేటీఆర్కు ఉంది : మంత్రి జగదీష్ రెడ్డి

భారత్ను పరిపాలించే సత్తా కేసీఆర్, కేటీఆర్కు ఉంది : మంత్రి జగదీష్ రెడ్డి

నల్లగొండ జిల్లా : కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరువు కాటకాలకు అల్లాడిందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ.. నిజాం కాలంలోనే జిల్లాగా ఉందన్నారు. ఇప్పుడు నల్గొండ అద్భుత పూలవనంగా మారిందన్నారు. కేసీఆర్ దత్తతతో నల్గొండ నగరం పునర్నిర్మాణం జరిగిందన్నారు. దళితులను కూడా మోసం చేసిన వాళ్లు కాంగ్రెస్ నేతలని విమర్శించారు. నల్గొండ ప్రగతి నివేదన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. 

తెలంగాణ వచ్చాక వరుసగా 18 సార్లు పంటలకు నీళ్లు అందించామన్నారు. ఏబీసీడీలు రాకపోయినా ఐటీ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. దొంగ సర్టిఫికెట్లతో కాలం గడిపి పోయాడని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రోజుకు 18 గంటలు పని చేస్తున్నారని చెప్పారు. ఐటీ రంగంలో ప్రపంచ స్థాయి గుర్తింపు తెలంగాణకు వచ్చిందన్నారు. భారత్ ను పరిపాలించే సత్తా కేసీఆర్, కేటీఆర్ లకు ఉందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.